ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘బాహుబలి ది ఎపిక్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘బాహుబలి ది ఎపిక్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Published on Dec 24, 2025 10:02 AM IST

Baahubali The Epic

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన మాగ్నమ్ ఓపస్ చిత్రం బాహుబలి ఇండియన్ సినిమాలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రాలు తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయంగా చాటి చెప్పాయి. ప్రభాస్, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, అనుష్క శెట్టి, తమన్నా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టి అదరగొట్టాయి. ఇక ఈ రెండు సినిమాలను కలుపుతూ ఇటీవల ‘బాహుబలి ది ఎపిక్’ (Baahubali The Epic) టైటిల్‌తో గ్రాండ్ రిలీజ్ చేశారు మేకర్స్.

రెండు భాగాలు ఒకే సినిమాగా చూసేందుకు ప్రేక్షకులు మరోసారి థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌తో మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ‘బాహుబలి ది ఎపిక్’ (Baahubali The Epic) చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. 3 గంటల 40 నిమిషాల నిడివిగల ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు