
న్యాచురల్ స్టార్ నాని(Nani) వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా ‘ది పారడైజ్’ షూటింగ్‌లో ఆయన పాల్గొంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. దీని తర్వాత, ఏప్రిల్ 2026 నుండి సుజిత్ దర్శకత్వంలో రూపొందనున్న మరో యాక్షన్ డ్రామా షూటింగ్‌ను నాని ప్రారంభించనున్నారు.
ఈ క్రమంలోనే సెన్సిబుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో నాని (Nani)ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెంకీ అట్లూరి గతంలోనే నానికి ఒక స్క్రిప్ట్ వినిపించగా, ప్రస్తుతం ఆ చర్చలు తుది దశకు చేరుకున్నాయి. అయితే, ఈ ప్రాజెక్టుపై నాని ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ అంతా కుదిరితే, సుజిత్ సినిమా పూర్తయిన వెంటనే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది.
మరోవైపు వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్య సినిమాతో బిజీగా ఉండగా, ఆ చిత్రం మే 2026లో విడుదల కానుంది. నాని (Nani) కూడా కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్‌తో మరో సినిమా కోసం చర్చలు జరుపుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.

