ధనుష్ సరసన సీనియర్ బ్యూటీ.. సెట్ అయ్యేనా..?

ధనుష్ సరసన సీనియర్ బ్యూటీ.. సెట్ అయ్యేనా..?

Published on Aug 6, 2026 1:03 AM IST

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న ఓ మైథాలాజికల్ జంగిల్ అడ్వెంచర్ చిత్రంలో ధనుష్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటించనున్నట్లు టాక్. తమిళ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ తెరకెక్కించనున్న ఈ భారీ ప్రాజెక్ట్ దట్టమైన అడవి నేపథ్యంలో ఏనుగు చుట్టూ తిరిగే కథాంశంతో సాగనుంది. 2027 ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

​ఒకవేళ కరీనా ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చెబితే, ‘దేవదాస్’ నాటి నుంచి భన్సాలీతో ఉన్న రెండు దశాబ్దాల గ్యాప్‌కు ముగింపు పడనుంది. ప్రస్తుతం భన్సాలీ ‘లవ్ అండ్ వార్’ పనుల్లో బిజీగా ఉండగా, ఆ చిత్రం పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.

తాజా వార్తలు