నితేష్ తివారి దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన లభించింది. నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ఎపిక్ మూవీ ప్రపంచవ్యాప్త పంపిణీ హక్కులను సోనీ పిక్చర్స్ దక్కించుకుంది.
ఈ క్రమంలో ‘రామాయణ: పార్ట్ 1’ చిత్రాన్ని నవంబర్ 6, 2026న తెలుగు సహా పలు భారతీయ భాషల్లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రత్యేకంగా ఐమాక్స్, ఇతర ప్రీమియం ఫార్మాట్లలో రానున్న ఈ చిత్రంలో సన్నీ డియోల్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా, ఏఆర్ రెహమాన్ పాటలు, హన్స్ జిమ్మర్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.


