‘మురారి’ స్క్రీన్స్ లో ‘వారణాసి’ బ్లాస్ట్!?

‘మురారి’ స్క్రీన్స్ లో ‘వారణాసి’ బ్లాస్ట్!?

Published on Dec 28, 2025 6:07 PM IST

Murari

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటర్నేషనల్ మార్కెట్ హీరోగా రూపాంతరం చెందుతున్న సంగతి తెలిసిందే. తన నుంచి ఎన్నో ఏళ్ళు నుంచి ఎదురు చూస్తున్న హాలీవుడ్ ఎంట్రీ రేంజ్ సినిమాగా “వారణాసి”తో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ తోనే ఆల్రెడీ వరల్డ్ సినిమా దగ్గర ఈ చిత్రం హాట్ టాపిక్ గా కూడా మారింది.

అయితే బిగ్ స్క్రీన్స్ లో వారణాసి ట్రీట్ ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. కేవలం ఒకటీ రెండు స్క్రీన్స్ లో పర్శనల్ గా కొందరు యాజమాన్యం ఈ సినిమా గ్లింప్స్ లో ప్లే చేస్తున్నారు కానీ సింగిల్ స్క్రీన్స్ ఇంకా మరిన్ని మల్టీప్లెక్స్ లాంటి వాటిలో వారణాసి గ్లింప్స్ ఇంకా రాలేదు. కానీ మహేష్ బాబు అభిమానులకి ఇప్పుడు “మురారి”(Murari ) రూపంలో ట్రీట్ రానుందట.

ఈ 31న మురారి రీరిలీజ్ కి వస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా స్క్రీన్స్ లో వారణాసి గ్లింప్స్ ప్లే అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఆల్రెడీ టీజర్ సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. సో మురారి (Murari ) ప్రింట్స్ తో పాటుగా వారణాసి అటాచ్ అయ్యి రాబోతుంది అని చెప్పాలి. మరి ఇది నిజమైతే ఫ్యాన్స్ పెద్ద పండుగే అని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు