పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్ లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఐతే, సోషల్ మీడియాలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు కొత్త ఏడాది రాకముందే ‘స్పిరిట్’ చిత్రానికి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన దానిని విడుదల చేసి, అభిమానులను సర్‌ప్రైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బహుశా సినిమా విడుదల తేదీతో పాటు ఫస్ట్-లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసే అవకాశం ఉంది.
కాగా ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమా మొత్తంలోనే హైలైట్ అవుతాయట. పైగా ఈ సీక్వెన్స్ ఈ సినిమా మొత్తానికే మెయిన్ హైలెట్ గా నిలిచిపోతుందట. ఇక ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ మరియు కాంచన కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా, టీ-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ పాన్-వరల్డ్ యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నాయి. మొత్తానికి సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని తెలుస్తోంది.


