అప్పలసూరిగా వెర్సటైల్ యాక్టర్ షాకింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్.. ‘పెద్ది’కి పెద్ద దిక్కుకానున్నాడా..?

అప్పలసూరిగా వెర్సటైల్ యాక్టర్ షాకింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్.. ‘పెద్ది’కి పెద్ద దిక్కుకానున్నాడా..?

Published on Dec 29, 2025 4:04 PM IST

Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ కోసం అభిమానులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా మరో కీలక పాత్రకు సంబంధించిన క్యారెక్టర్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ లేటెస్ట్ పోస్టర్‌లో విలక్షణ నటుడు జగపతి బాబు పూర్తిగా భిన్నమైన అవతార్‌లో దర్శనమిచ్చారు. అప్పల సూరి అనే పాత్రలో ఆయనను చూసిన వారు తొలుత గుర్తుపట్టలేని స్థాయిలో ట్రాన్స్‌ఫర్మేషన్ కనిపిస్తోంది. ఈ పాత్రకు బలమైన ప్రాధాన్యం ఉందని చిత్రబృందం చెబుతుండటంతో, తెరపై జగపతి బాబు ఈ క్యారెక్టర్‌ను ఎలా మలిచారో అన్న ఆసక్తి భారీగా పెరిగింది.

గ్రామీణ క్రీడా నేపథ్యంతో రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రంలో శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, సత్య తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రెజెంట్ చేస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా 2026 మార్చి 27న ‘పెద్ది’ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

తాజా వార్తలు