ప్రభాస్ వ్యక్తిత్వానికి అనీల్ రావిపూడి హ్యాట్సాఫ్!

ప్రభాస్ వ్యక్తిత్వానికి అనీల్ రావిపూడి హ్యాట్సాఫ్!

Published on Dec 30, 2025 3:24 PM IST

Prabhas

ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి రాబోతున్న పలు అవైటెడ్ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. మరి వాటిలో మొదటిగా రాబోతున్న చిత్రం ది రాజా సాబ్. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా గ్రాండ్ ప్రీరిలీజ్ రీసెంట్ గానే జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో ప్రభాస్ ఇచ్చిన ఓ స్టేట్మెంట్ అందరి హృదయాలను గెలుచుకుంది.

ప్రభాస్ మాట్లాడుతూ తాము ఎప్పుడు సీనియర్ హీరోల తర్వాతే అని సీనియర్లు సీనియర్లే అంటూ చేసిన కామెంట్స్ మంచి వైరల్ గా మారాయి. ఇక ఈ స్టేట్మెంట్ పైనే మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు సినిమా చేసిన దర్శకుడు అనీల్ రావిపూడి చేసిన స్టేట్మెంట్ ఇప్పుడు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

పాన్ ఇండియా వైడ్ అంత స్టార్డం ఉన్నప్పటికీ ప్రభాస్ మన టాలీవుడ్ సీనియర్ హీరోలకి ఇచ్చిన గౌరవం అది తన వ్యక్తిత్వానికి నిదర్శనం అని అందుకు హ్యాట్సాఫ్ చెపుతున్నట్టు తెలిపారు. అలాగే ఇదే విషయాన్ని గ్రాండ్ ఈవెంట్ ద్వారా కూడా చెబుదాం అనుకున్నాను అని ఖచ్చితంగా మళ్ళీ చెప్తానని తెలిపారు. దీనితో డార్లింగ్ హీరోపై తన స్టేట్మెంట్ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు