మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేసిన పెద్ది సినిమా సెన్సేషనల్ సక్సెస్ తర్వాత దర్శకుడు సుకుమార్ తో తన కెరీర్ 17వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు సెట్ చెసుకున్న ఈ సినిమా ఇంకా మొదలు కావల్సి ఉంది. అయితే మన ఇండస్ట్రీలో సినీ స్టార్స్ అందరికీ దాదాపు ఇతర బిజినెస్ లు కూడా ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఈ విషయంలో రామ్ చరణ్ కొంచెం వెనకబడే ఉన్నాడు.
కానీ క్రికెట్ అని, ఇతర కొన్ని వర్గాల్లో మాత్రం రామ్ చరణ్ దిగడం జరిగింది. ఇదిలా ఉండగా రామ్ చరణ్ ఇప్పుడు మన టాలీవుడ్ స్టార్స్ కొందరు రాణిస్తున్న మల్టీప్లెక్స్ రంగంలో కూడా దిగుతున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ లు తమ పేరిట మల్టీప్లెక్స్ లు తెరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరితో పాటు రామ్ చరణ్ కూడా ఈ రంగంలో దిగనున్నట్టు తెలుస్తోంది. 2027 లో చరణ్ మల్టీప్లెక్స్ లాంచ్ కానున్నట్లు టాక్. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.


