సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ చిత్రమే ‘జైలర్ 2’. తన భారీ బ్లాక్ బస్టర్ హిట్ జైలర్ కి సీక్వెల్ గా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం తమిళ్ తో పాటుగా తెలుగు ఆడియెన్స్ కూడా ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ అక్టోబర్ నెలలో గ్రాండ్ గా విడుదలకి రాబోతున్న ఈ చిత్రంలో పార్ట్ 1 లానే అనేకమంది స్టార్స్ క్యామియోలు ఉన్న సంగతి తెలిసిందే.
అయితే వీరిలో లేటెస్ట్ గా ఓ పాపులర్ స్టార్ నటుడు తన క్యామియో ఉందని కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఆ నటుడు ఎవరో కాదు విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. కొన్నాళ్ల కితమే తాను ఇక క్యామియోలు, విలన్ పాత్రలు చేయనని చెప్పేసిన సంగతి తెలిసిందే. కానీ తాను ఈ సినిమాలో నటిస్తున్నట్టు పలు రూమర్స్ వచ్చాయి.
కానీ ఫైనల్ గా ఈ సినిమాలో తాను ఉన్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఈ ఒక్క సినిమాలో మాత్రం తాను క్యామియో చేసానని అందుకు కారణం కేవలం రజినీకాంత్ గారి సినిమా కావడమే అని రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు. సో జైలర్ 2 లో విజయ్ సేతుపతి రోల్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఈ అక్టోబర్ 15న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.


