2025 సంవత్సరం ముగింపుకు చేరుకుంది. ఈ ఏడాదిలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సినిమాలు రిలీజ్ అయి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. కొన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అవగా, మరికొన్ని నిరుత్సాహపరిచాయి. అయితే 2025 టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంతో పాటు వసూళ్ల వర్షం కురిపించిన టాప్ 5 గ్రాస్ చిత్రాలు ఏమిటో ఇక్కడ చూద్దాం.
ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఓజి’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయింది. దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.302 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి 2025లో టాప్ గ్రాసింగ్ తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో పవన్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి తన స్టామినా ఏమిటో చూపెట్టాడు.
ఇక 2025 సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ అయిన పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలో విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ.280 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం సర్‌ప్రైజింగ్‌గా ఈ జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ సినిమా రూ.197 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 3వ స్థానంలో నిలిచింది. అయితే, ఈ చిత్రానికి పెట్టిన భారీ బడ్జెట్ దృష్ట్యా ఈ మూవీ డిజాస్టర్‌గా మిగిలింది. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామా చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.
యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ చిత్రం అత్యంత ఎక్కవ గ్రాస్ వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సినిమా రూ.142 కోట్ల మేర గ్రాస్ వసూళ్లతో దుమ్ములేపింది. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేయగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీ.జి.విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు.
ఇక అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న ముఖ్య పాత్రల్లో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘కుభేర’ చిత్రం రూ.138 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 5 స్థానంలో నిలిచింది. ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ కావడంతో ఈ మూవీ భారీ వసూళ్లను రాబట్టింది.
ఇలా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 2025లో ప్రేక్షకులను మెప్పించే కంటెంట్‌తో రిలీజ్ అయిన సినిమాలు వసూళ్ల పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టి ఈ ఏడాదిలో తమ సత్తా చాటాయి. మరి ఈ సినిమాల్లో మీకు ఏ సినిమా నచ్చిందో కామెంట్ చేయండి.


