‘మన శంకర వరప్రసాద్ గారు’ విషయంలో గట్టిగా ఫిక్స్ అయిపోయిన ఫ్యాన్స్!

‘మన శంకర వరప్రసాద్ గారు’ విషయంలో గట్టిగా ఫిక్స్ అయిపోయిన ఫ్యాన్స్!

Published on Jan 6, 2026 8:10 AM IST

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా వెంకీ మామ కీలక పాత్రలో దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు” కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ రేలీజ్ తర్వాత వాటిని ఇంకా పెంచుకుంది. అయితే ప్రస్తుతం మిగతా ఆడియెన్స్ లో ఎలా ఉన్నా మెగా అభిమానులు మరీ ముఖ్యంగా చిరంజీవి అభిమానులు ఈ సినిమా గట్టిగానే కొట్టేలా ఉందని భావిస్తున్నారు.

మెగాస్టార్ లుక్స్ నుంచి సినిమా కంటెంట్ వరకు ఆడియెన్స్ లో సంక్రాంతికి బాగానే రీచ్ అవుతుంది అని భావిస్తున్నారు. దీనితో వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత మళ్ళీ దానికి మించిన పెద్ద హిట్ గా మన శంకర వరప్రసాద్ గారు అవుతుంది అని మాట్లాడుకుంటున్నారు. మరి వారు అనుకున్న రేంజ్ లో ఈ సినిమా ఆకట్టుకుంటుందా లేదా అనేది ఈ జనవరి 12తో తెలిసిపోతుంది.

తాజా వార్తలు