స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల పలు వెబ్ సిరీస్ లలో కనిపించి అలరించిన సంగతి తెలిసిందే. మరి ఇవి మాత్రమే కాకుండా తన జీవితంలో కొత్త చాప్టర్ కూడా మొదలు పెట్టింది. అయితే తెలుగులో మొన్నామధ్య శుభం సినిమాలో చిన్న క్యామియో చేసిన సమంత నుంచి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు.
మరి వారికి “మా ఇంటి బంగారం” (Maa Inti Bangaram) అనే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ని ఎప్పుడో స్టార్ట్ చేసింది కానీ అది అలా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఈ సినిమాని నందిని రెడ్డితో ఇటీవల మళ్ళీ పట్టాలెక్కించగా ఇప్పుడు సామ్ నుంచి సాలిడ్ అప్డేట్ ఒక మాస్ పోస్టర్ తో వచ్చేసింది. దీనితో సమంత ఈ సినిమా తాలూకా టీజర్ ట్రైలర్ ని ఈ జనవరి 9న విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రానికి సమంత భర్త రాజ్ నిడుమోరు కథ అందించగా సామ్ నే నిర్మాణం వహిస్తుంది. అలాగే ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.


