చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా సంక్రాంతి బరిలో రిలీజ్ కానుంది. మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో శర్వా ముచ్చటగా మూడోసారి సంక్రాంతి బరిలో తన సినిమాతో రానున్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై సాలిడ్ బజ్ క్రియేట్ చేశాయి.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ పనులు కూడా ముగిశాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇందులోని కంటెంట్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఎంటర్‌టైన్ చేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సింగిల్ కట్ కూడా సెన్సార్ బోర్డు వారు అభ్యంతరం చెప్పలేదని మేకర్స్ గర్వంగా చెబుతున్నారు.
సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను జనవరి 14న సాయంత్రం 5.49 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాను ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర ప్రొడ్యూస్ చేస్తున్నారు.


