పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతీ కలయికలో చేసిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం ది రాజా సాబ్ కోసం అందరికీ తెలిసిందే. ఈ కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగని ఈ సినిమానే మొదలు పెట్టబోతోంది. దీనితో మరింత హైప్ దీనిపై నెలకొనగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా గ్రాండ్ ప్రీమియర్స్ కూడా లాక్ చేసుకుంది. ఇక యూఎస్ మార్కెట్ లోకి వస్తే రెబల్ స్టార్ అక్కడ రేజ్ చూపిస్తున్నాడు.
మరి అక్కడ సునాయాసంగా ఈ సినిమా 1 మిలియన్ మార్క్ ని అప్పుడే దాటేసింది. ఇంకా ప్రీమియర్స్ పడకుండానే రాజా సాబ్ ఈ మార్క్ ని అందుకోవడం విశేషం. ఇక డే 1 కి ఈ లెక్కలు మరింత ఎక్కువ ఉంటాయని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాని దర్శకుడు మారుతి గ్రాండ్ ఫాంటసీ వండర్ గా తెరకెక్కిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా నటించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.


