పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ అలాగే రిద్ధి కుమార్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతితో చేసిన అవైటెడ్ చిత్రమే ది రాజా సాబ్(The Raja Saab). ప్రభాస్ నుంచి ఎంతో కాలంగా మిస్ అవుతున్న ఒక ఎనర్జెటిక్ రోల్ ని అభిమానులు మళ్ళీ విట్నెస్ చేశారు.
మంచి బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా అభిమానులకి మాత్రం ఎక్కడో చిన్న అసంతృప్తి అయితే మిగిల్చింది. మెయిన్ గా ప్రభాస్ ఓల్డేజ్ గెటప్ సీక్వెన్స్ లేకపోవడంతో బాగా డిజప్పాయింట్ అయ్యారు. దీనితో మేకర్స్ ఈ సీన్స్ ని వెంటనే యాడ్ చేయగా దీనికి మాస్ రెస్పాన్స్ ఇపుడు థియేటర్స్ లో వస్తుంది.
అభిమానులు ఈ సీక్వెన్స్ చూసాక తమ ఆనందాన్ని పంచుకోకుండా ఉండలేకపోతున్నారు. ఈ మొత్తం సీక్వెన్స్ కాన్సెప్ట్, సంగీతం మారుతి టేకింగ్ ఇంకా థమన్ బాక్గ్రౌండ్ స్కోర్ ల కోసం మాట్లాడుకుంటున్నారు. మరి ఇదే సీక్వెన్స్ డే 1 నే యాడ్ చేసేసి ఉంటే ఇంత ల్యాగ్ కూడా ఉండేది కాదేమో. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మాత్రం ఆడియెన్స్ ఈ మ్యాడ్ సీక్వెన్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.


