పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ లైనప్ లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లు కూడా జత కానున్నాయి. అయితే లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఓ పిక్ సర్క్యులేట్ అవుతుంది. అయితే ఇందులో చాలామంది ప్రభాస్ లుక్స్ కోసం మాట్లాడుకుంటున్నారు కానీ చాలా తక్కువమంది మాత్రమే తనతో పాటు వ్యక్తి కోసం కలిపి మాట్లాడుకుంటున్నారు. మరి అదెవరో కాదు మలయాళం యంగ్ దర్శకుడు దిన్జీత్ అయ్యాథన్.
ఇటీవల ఆడియెన్స్ ని ‘ఎకో’ అనే సినిమాతో సర్ప్రైజ్ చేసిన ఈ దర్శకుడు ప్రభాస్ ని కలవడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. దీనితో తన లైనప్ లో ఈ యంగ్ దర్శకుడుతో కూడా సినిమా ఉంటుంది అని క్రేజీ బజ్ మొదలైంది. మరి ఈ కాంబినేషన్ లో సినిమా సెట్ అయితే మాత్రం ప్రభాస్ నుంచి అది మరొక ఊహించని సర్ప్రైజ్ అనే అనుకోవాలి. అలాగే ఈ సినిమాని సలార్ మేకర్స్ హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించనున్నారు అన్నట్టు టాక్.


