ల్యాండ్‌మార్క్ కోసం కింగ్ ఆరాటం..!

ల్యాండ్‌మార్క్ కోసం కింగ్ ఆరాటం..!

Published on Mar 11, 2026 12:55 AM IST

Nagarjuna

అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమాలో నాగార్జున లుక్ గురించి దర్శకుడు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ‘శివ’, ‘రక్షకుడు’ సినిమాల్లోని స్టైలిష్ నాగార్జునను ఈ చిత్రంలో మళ్లీ చూడవచ్చని, ఆయన మూడు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారని రా కార్తీక్ తెలిపాడు. తన 100వ సినిమాకు ఒక తమిళ దర్శకుడిని ఎంచుకోవడం వెనుక నాగార్జునకు కథపై ఉన్న నమ్మకమే కారణమని ఆయన పేర్కొన్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి టబూ కీలక పాత్ర పోషిస్తుండగా, ‘నాట్యం’ ఫేమ్ సుస్మితా భట్ మరో హీరోయిన్‌గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2026 దసరా కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

తాజా వార్తలు