ప్రస్తుతం ఇండియన్ సినిమా నిర్మిస్తున్న ప్రైడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా అలాగే పృథ్వీ రాజ్ సుకుమారన్ కాంబినేషన్ లో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న చిత్రం “వారణాసి”(Varanasi) కూడా ఒకటి. కేవలం ఇంట్రో వీడియో తోనే హాలీవుడ్ ఆడియెన్స్ ని సైతం మన తెలుగు సినిమా వైపు చూసేలా చేశారు. ఇక ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ప్లాన్డ్ గా వెళుతుండగా లేటెస్ట్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది.
దీని ప్రకారం మహేష్ బాబు కొత్త లుక్ లోకి మారినట్టు వినిపిస్తుంది. మహేష్ మళ్ళీ క్లీన్ షేవ్ లోకి వచ్చేశారని వినిపిస్తుంది. అంతే కాకుండా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ సీన్స్ చేస్తున్నారట. ఈ సినిమాలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ టైం లైన్స్ కి సంబంధించిన సన్నివేశాలే తెరకెక్కిస్తున్నారట. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఎస్ ఎస్ కార్తికేయ, కే ఎల్ నారాయణ నిర్మాణం వహిస్తున్నారు.


