నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న సరికొత్త చిత్రం ది ప్యారడైజ్. ‘దసరా’ వంటి భారీ విజయం తర్వాత వీరిద్దరి కలయికలో రూపుదిద్దుకుంటున్న రెండవ సినిమా కావడంతో, మొదటినుంచీ ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా టీజర్‌కు సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్‌ను చిత్ర బృందం పంచుకుంది.
ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాకి సంబంధించిన టీజర్ రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో, టీజర్‌లో ఆయన అందించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏ స్థాయిలో ఉంటుందోనని సంగీత ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ టీజర్ మూవీ లవర్స్‌లో అంచనాలను మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.


