మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu)(సంక్రాంతి కానుకగా నేడు(జనవరి 12) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడంతో ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై అంచనాలు పెంచాయి.
అయితే, ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తుండటంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను ప్రేక్షకులు, అభిమానులు థియేటర్లలో ఎంజాయ్ చేస్తున్నారు. సెలబ్రిటీలు సైతం వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని వీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన బాస్ చించేశారు.. వింటేజ్ రౌడీ అల్లు స్వాగ్ కనిపించిందని.. ఘరానా మొగుడు వైబ్స్ తీసుకొచ్చారని.. ఉత్సాహంగా తన రివ్యూ ఇచ్చారు. ఈ సినిమాతో అభిమానుల ఆకలి తీరిందని ఆయన కామెంట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


