దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు కలయికలో రాబోతున్న సినిమా ‘వారణాసి’. ఈ సినిమా పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కథ, ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్లు, విజువల్ స్కేల్ గురించి ఇప్పటికే ఎన్నో చర్చలు జరుగుతుండగా, ఇప్పుడు ఈ సినిమా క్లైమాక్స్ కు సంబంధించిన వార్తలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ‘వారణాసి’ క్లైమాక్స్‌ను భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారట. కథలోని కీలక భావోద్వేగాలు, అడ్వెంచర్ అంశాలు, విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ ఈ క్లైమాక్స్‌లోనే పరాకాష్టకు చేరుకునేలా రాజమౌళి ప్లాన్ చేశారట.
ముఖ్యంగా మంచు పర్వతాలు, ప్రకృతి వైపరీత్యం, భారీ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించేలా క్లైమాక్స్ చిత్రీకరణ ఉండబోతుందనే తెలుస్తోంది. కాగా ప్రియాంక ఈ సినిమాలో మందాకినిగా కనిపిస్తూ ఉండగా.. మహేశ్ రుద్రగా.. శ్రీరాముడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కాగా ‘వారణాసి’ చిత్రం రూ.1300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను కెఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తుండగా, కథా కథనాన్ని విజయేంద్ర ప్రసాద్ రూపొందించారు. ఇక ఈ సినిమాకి దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు.


