అథర్వా, ప్రీతి ముకుందన్, కయాదు లోహర్ లీడ్ రోల్స్‌లో ఆకాష్ బాస్కరన్ తెరకెక్కించిన చిత్రం ‘హృదయం మురళి’. ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలో మంచి స్పందనను పొందిన ఈ తమిళ చిత్రం, ఇప్పుడు ఓటీటీ (OTT)లో విడుదల కానుంది. ఆగస్టు 7, 2026న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ సినిమా ఏయే భాషల్లో అందుబాటులో ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇక ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, కయాదు లోహర్, జోనితా గాంధీ మరియు మాళవిక మోహనన్ కీలక పాత్రలు పోషించారు. ఫహాద్ ఫాజిల్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించగా, ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాష్ భాస్కరన్ నిర్మించిన ఈ సినిమా, డిజిటల్ విడుదల ద్వారా అయినా విస్తృతమైన ప్రేక్షకులను చేరుకుంటుందేమో చూడాలి. తెలుగు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఈ సినిమా విజయం సాధించలేదు.


