మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu). దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అభిమానులని కుటుంబ ప్రేక్షకులని ఎంతగానో అలరించి అదరగొడుతుంది. మూడో రోజు కూడా స్ట్రాంగ్ బుకింగ్స్ తో దూసుకెళ్తున్న ఈ సినిమా రెండు రోజుల్లో 100 కోట్ల మార్క్ ని దాటేసి దుమ్ము లేపింది.
ఇక మేకర్స్ ఈ సినిమా రెండు రోజుల ప్రపంచ వ్యాప్త వసూళ్ల నెంబర్ రివీల్ చేశారు. దీనితో మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu) ఏకంగా 120 కోట్ల గ్రాస్ ని కేవలం రెండు రోజుల్లోనే అందుకున్నట్టు తెలిపారు. వర్కింగ్ డే లో ఈ సినిమా సుమారు 40 కోట్ల మేర గ్రాస్ ని రాబట్టడం అనేది చిన్న విషయం కాదు. ఇక పండుగ మూమెంట్ లో ఈ నెంబర్ మరింత ఎక్కువ వెళ్లే ఛాన్స్ ఉంది.
సో ఈ కొన్ని రోజుల్లోనే ఈజీగా ఈ సినిమా 200 కోట్ల మార్క్ ని దాటే ఛాన్స్ కూడా ఉంది. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా వెంకీ మామ కీలక పాత్ర చేశారు. అలాగే భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాకి సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మాణం వహించారు.



