2 రోజుల్లో 40 కోట్లు గ్రాస్.. నవీన్ పొలిశెట్టి ఎమోషనల్ స్టేట్మెంట్!

2 రోజుల్లో 40 కోట్లు గ్రాస్.. నవీన్ పొలిశెట్టి ఎమోషనల్ స్టేట్మెంట్!

Published on Jan 16, 2026 4:30 PM IST

AOR movie

మన టాలీవుడ్ స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా మారి దర్శకత్వంలో తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju). మంచి బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ అందుకుంది. మొదటి రోజు 20 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకోగా రెండో రోజు కూడా అదే నిలకడ కొనసాగించి మొత్తం 41.2 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ అందుకుంది. దీనితో ఆడియెన్స్ ఏ రేంజ్ లో ఆదరణ అందిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

అయితే ఈ రెస్పాన్స్ తో నవీన్ ఎమోషనల్ పోస్ట్ చేసాడు. మీ టికెట్ డబ్బులకి నేను 500 పర్సెంట్ విలువ ఇవ్వడానికే కష్టపడతాను అని లవ్యూ జాన్ జిగ్రీస్ అంటూ పోస్ట్ చేసాడు. దీనితో ఈ సినిమా విజయం తనకి ఎంత పర్శనల్ గా ఫీల్ అవుతున్నాడు అనేది అర్ధం అవుతుంది. ఇక ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు