ఓటిటి సమీక్ష: మమ్ముట్టి ‘కలంకావల్’ – తెలుగు డబ్ చిత్రం సోనీ లివ్ లో

ఓటిటి సమీక్ష: మమ్ముట్టి ‘కలంకావల్’ – తెలుగు డబ్ చిత్రం సోనీ లివ్ లో

Published on Jan 17, 2026 1:55 PM IST

Kalamkaval Review

విడుదల తేదీ : జనవరి 16, 2025
స్ట్రీమింగ్ వేదిక : సోనీ లివ్

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : మమ్ముట్టి, వినాయకన్, రజిష విజయన్, మాళవిక మీనన్ తదితరులు
దర్శకత్వం : జితిన్ కే జోస్
నిర్మాత : మమ్ముట్టి
సంగీతం : ముజీబ్ మజీద్
ఛాయాగ్రహణం : ఫైసల్ అలీ
కూర్పు : ప్రవీణ్ ప్రభాకర్

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

థ్రిల్లర్ సినిమాలు అంటే మలయాళ సినిమా పెట్టింది పేరు. ఈ ఇండస్ట్రీ నుంచి లేటెస్ట్ గా వచ్చిన ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమే ‘కలంకవల్’ (Kalamkaval). వెర్సటైల్ నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇటీవల సోనీ లివ్ లో తెలుగు డబ్బింగ్ లో కూడా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

Kalamkaval Story కథ:

కేరళ అలాగే తమిళనాడు ప్రాంతాల్లో 2005 నుంచి 2012 మధ్యలో కొందరు మధ్య వయస్సు కలిగిన అమ్మాయిలు, పెళ్లీడుకి వచ్చి పెళ్లి కాకుండా ఉండే అమ్మాయిలు ఇంకా పెళ్ళై విడాకులు అయ్యిన వారు, పెళ్ళైన ఒంటరి మహిళలు ఒకొక్కరిగా కనిపించకుండా పోతారు. అసలు వాళ్ళు ఏమయ్యారు అనేది కూడా చిన్న ఆనవాలు ఉండదు. ఇది కేరళ పోలీస్ కి సవాలుగా మారుతుంది. ఈ క్రమంలో గుడ్లగూబగా పిలవబడే క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ జయకృష్ణ (వినాయకన్) ఈ కేసులోకి వస్తారు. అలాగే ఒక డీసెంట్ ఫ్యామిలీ మ్యాన్ అయినటువంటి స్టాన్లీ దాస్ (మమ్ముట్టి) ఈ సీరియల్ క్రైమ్ లోకి ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వారంతా ఎందుకు చంపబడుతున్నారు? వరుస హత్యలు చేస్తున్నది ఎవరు? ఎందుకు చేస్తున్నారు? చివరికి పోలీస్ అతన్ని పట్టుకున్నారా లేదా అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తీరాలి.

ప్లస్ పాయింట్స్:

డైరెక్ట్ విషయంలోకే వస్తే.. ఇదే కాన్సెప్ట్ లో హిందీ సిరీస్ కూడా ఒకటి ఉంది. ఆ సిరీస్ చూసిన వారికి ఇది కొంచెం తెలిసిందే కదా అనిపించవచ్చు కానీ అది చూడకుండా ట్రై చేసినారికి మాత్రం ఈ సినిమా ఒక ప్యాకెడ్ థ్రిల్లర్ ట్రీట్ ని అందిస్తుంది. ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ ని చూడాలి అనుకునేవారికి ఈ సినిమా తమ ఓటిటి ఓటిటి వాచ్ లిస్ట్ లో డెఫినెట్ గా పెట్టుకోవచ్చు.

ఇది నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిందే కావడం కథలో ప్రధాన బలం. మరి దానికి తగ్గట్టుగానే ఇందులో కథనం కూడా అంతకు మించి థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఎక్కడా పెద్దగా బోర్ కొట్టకుండా నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటూ సాగే ఇన్వెస్టిగేషన్ మంచి థ్రిల్ మూమెంట్స్ తో ఆడియెన్ ని హుక్ చేసి ఉంచేలా చేస్తుంది. ఈ విషయంలో దర్శకునికి ఎక్కువ మార్కులు ఇవ్వొచ్చు.

అలాగే కొన్ని ట్విస్ట్ లు కూడా సాలిడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో బాగా వర్కౌట్ అవుతాయి. ఇక ఇందులో మరో బిగ్గెస్ట్ ఎసెట్ మాత్రం మమ్ముట్టి పెర్ఫామెన్స్ అని చెప్పాలి. ఇలాంటి ఒక డార్క్ రోల్ ని తాను ఎంచుకోవడం ఒకింత సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. అలాంటి రోల్ ని కూడా తాను అద్భుతంగా పండించారు. తన మార్క్ సెటిల్డ్ పెర్ఫామెన్స్, నెగిటివ్ షేడ్స్ తో స్టాన్లీ దాస్ అనే పాత్రకి పూర్తి న్యాయం చేశారు.

ఇక ఇందులో జైలర్ నటుడు వినాయకన్ కి కూడా మంచి రోల్ దక్కింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా తన నటన చాలా బాగుంది. ఆ రోల్ కి తాను పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఇక వీరితో పాటుగా ఇతర నటీనటులు అంతా నాచురల్ పెర్ఫామెన్స్ ని అందించారు. అంతే కాకుండా ఆల్రెడీ ఆ సిరీస్ ని చూసినవారికి కూడా ఇందులో కథనం దాని కంటే బెటర్ గా, గ్రిప్పింగ్ గా అనిపిస్తుంది. దీనితో పాటుగా కొన్ని మార్పులు చేర్పులు కూడా ఇందులో బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

పైన చెప్పినట్టు గానే ఈ సినిమా కాన్సెప్ట్ లో హిందీలో నటుడు విజయ్ వెర్మ, సోనాక్షి సిన్హా కాంబినేషన్ లో వచ్చిన సిరీస్ ‘దహాడ్’ ని చూసి ఉంటే ఒక కొత్త మలయాళం థ్రిల్లర్ చూడాలి అనుకోని ఇది పెడితే ఒకింత ఆడియెన్ నిరాశ చెందవచ్చు.

ఒక సమయం తర్వాత కాన్సెప్ట్ ఇదే కదా ఆల్రెడీ చూసిందే అనే సరికి కోర్ కాన్సెప్ట్ పై ధీమా వచ్చేస్తుంది. సో అది రొటీన్ గానే అనిపిస్తుంది. అలాగే ఇది ఎంత రియల్ స్టోరీ అయినప్పటికీ అన్నేళ్ల క్రమంలో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ లో తెలియకుండా పోయిన వారి ఆచూకీ కానీ కనీసం వారి ఆనవాలు, చనిపోయినవారి దేహం కూడా దొరకకుండా ఉంటాయా అనేది లాజిక్ గా అనిపించదు. వీటితో పాటుగా మధ్యలో కొంచెం కథనం స్లో అయ్యినట్టు అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. మమ్ముట్టినే నిర్మాణం కూడా వహించారు. తాను అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ముజీబ్ వజీబ్ ఇచ్చిన సంగీతం చాలా బాగుంది. చాలా సీన్స్ లో తన సౌండ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లు పర్ఫెక్ట్ గా వర్క్ అయ్యాయి. అలాగే ఫైసల్ అలీ ఇచ్చిన కెమెరా వర్క్ కూడా డీసెంట్ గా ఉంది. ప్రవీణ్ ప్రభాకర్ ఎడిటింగ్ కూడా బాగుంది.

ఇక దర్శకుడు జితిన్ కే జోస్ విషయానికి వస్తే.. ఒకే కాన్సెప్ట్ తో పలు సినిమాలు, సిరీస్ లు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. అలానే ఇది మోలీవుడ్ వారి వెర్షన్. హిందీ సిరీస్ దహాడ్ తో పోలిక అనేది పక్కన పెడితే ఈ చిత్రానికి తన వర్క్ సాలిడ్ గా ఉంది. మెయిన్ గా తాను కథనం నడిపించిన విధానం కొత్తగా చూసేవారికి ఈ సినిమా మంచి థ్రిల్ ని అందిస్తుంది. అలాగే ఒకవేళ దహాడ్ సిరీస్ ని చూసినవారికి అయినా కూడా తన వర్క్, స్క్రీన్ ప్లే మరింత బెటర్ ఫీల్ ని కలిగిస్తాయి. సో తన వర్క్ ఈ సినిమాకి బాగుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ ‘కలంకావల్’, (Kalamkaval) ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి అనేది ఐడియా లేకుండా ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ని చూడాలి అనుకునేవారికి మాత్రం డీసెంట్ థ్రిల్స్ ని అందిస్తుంది. మెయిన్ గా మమ్ముట్టి తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టారు. అలాగే కథనం కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా వెళుతూ ఆడియెన్ ని ఎంగేజ్ చేస్తుంది. కాకపోతే ఆల్రెడీ ఇదే కాన్సెప్ట్ లో వచ్చిన సిరీస్ ని చూసినవారికి మాత్రం మరీ అంత కొత్తగా అనిపించదు. ఇది చూడనివారికి మాత్రం ఓటిటిలో ఈ చిత్రం మంచి ట్రీట్ అందిస్తుంది. వాచ్ ఇట్.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

తాజా వార్తలు