తన పేరు మీదే రికార్డ్స్.. రీజనల్ గా మెగాస్టార్ సినిమా మరో భారీ ఫీట్!

తన పేరు మీదే రికార్డ్స్.. రీజనల్ గా మెగాస్టార్ సినిమా మరో భారీ ఫీట్!

Published on Jan 17, 2026 10:27 AM IST

Mana Shankara Varaprasad Garu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Vara Prasad Garu). మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హౌస్ ఫుల్స్ తో దూసుకెళ్తూ దుమ్ము లేపుతుంది.

అయితే రీజనల్ గా ఈ సినిమా రికార్డులు అన్నీ తిరగరాస్తుంది అనిక్ చెప్పాలి. ఆల్రెడీ బుక్ మై షో బుకింగ్స్ లో ఫాస్టెస్ట్ 2 మిలియన్ బుకింగ్స్ క్రాస్ చేసిన సినిమాగా రికార్డు సెట్ చేయగా ఇప్పుడు 2.5 మిలియన్ ఫీట్ ని కూడా క్రాస్ చేసి ఫాస్టెస్ట్ ఎవర్ సినిమాగా నిలిచింది. ఇలా మెగాస్టార్ మాత్రం తన పేరిట బిగ్గెస్ట్ రికార్డులు సెట్ చేస్తున్నారు.

ఇక ఈ వీకెండ్ కి ఈ సినిమా ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి మరి. మరి ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా వెంకీ మామ సాలిడ్ క్యామియోలో నటించి సినిమాకి మరింత బలం చేకూర్చారు. అలాగే భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాని గోల్డ్ బాక్స్ ఎంటెర్టైన్మెంట్స్ మరియు షైన్ స్క్రీన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు