‘RRR’ ని మించి ‘మన శంకర వరప్రసాద్ గారు’.. డే 5 ఆల్ టైం రికార్డ్!

‘RRR’ ని మించి ‘మన శంకర వరప్రసాద్ గారు’.. డే 5 ఆల్ టైం రికార్డ్!

Published on Jan 17, 2026 1:08 PM IST

Mana Shankara Vara Prasad Garu

తెలుగు సినిమా నుంచి వచ్చిన పలు బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఏ సినిమా ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుంది అనేది చెప్పటం సాధ్యం కాదు. ఓ భారీ పాన్ ఇండియా సినిమా వచ్చినప్పటికీ దాన్ని రీజనల్ సినిమా మార్జిన్ తో కొట్టే ఘటనలు కూడా జరుగుతాయి. మరి అలాంటి రేర్ ఫీట్ లు గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో రిపీట్ అయితే ఇప్పుడు మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) సినిమాతో రిపీట్ అయ్యింది.

మన తెలుగు నుంచి భారీ మల్టీస్టారర్ చిత్రం RRR పేరిట ఉన్న సింగిల్ డే రికార్డుని మన శంకర వరప్రసాద్ గారు ఇప్పుడు బీట్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో RRR కి 5వ రోజున వచ్చిన మొత్తం షేర్ ని చిరంజీవి సినిమా ఒక కోటి మార్జిన్ తో దాటి ఆల్ టైం రికార్డు సింగిల్ డే గా నిలిచినట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనితో మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హవా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే లాంగ్ రన్ లో ఇలాంటివి మరిన్ని రిపీట్ అవుతాయా లేదా అనేది కూడా వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు