ఆ క్రేజీ సీక్వెల్ నుంచి తప్పుకున్న కార్తి..? అంతా ఆయన వల్లే..?

ఆ క్రేజీ సీక్వెల్ నుంచి తప్పుకున్న కార్తి..? అంతా ఆయన వల్లే..?

Published on Jan 18, 2026 12:00 AM IST

Karthi

తమిళ హీరో కార్తి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘ఖైదీ’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఆ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఆ సినిమాకు సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, ఇప్పుడు ఈ క్రేజీ సీక్వెల్ చిత్రం పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ‘కూలీ’ చిత్రం తర్వాత పలు కథలపై ఫోకస్ పెట్టాడని.. అయితే, ఆయన ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కొత్త ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేశాడని.. ఈ సినిమా పూర్తయ్యేసరికి చాలా సమయం పడుతుందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

దీంతో ఖైదీ సీక్వెల్ కోసం కార్తి ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాడని.. ఇక ఆయన ఇప్పుడు ఆ సీక్వెల్ నుంచి తప్పుకుని తన నెక్స్ట్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టేందుకు నిర్ణయించుకున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే లోకేష్ కారణంగా కార్తి ఈ క్రేజీ సీక్వెల్ చిత్రం నుంచి తప్పుకున్నాడా..? అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు