తెలుగు సినిమా దగ్గర ఈ ఏడాది కూడా మరో బిగ్గెస్ట్ సంక్రాంతి అని చెప్పొచ్చు. వచ్చిన ప్రతీ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించి దుమ్ము లేపాయి. అయితే మొదటి సినిమా నుంచి ప్రతీ సినిమా కూడా ఈ ఆదివారం వరకు గ్యాప్ లేకుండా క్యాష్ చేసుకున్నాయి. ఒక సినిమాకి దొరక్కపోతే మరో సినిమా చూసేసారు జనం. కానీ ఇప్పుడు అన్ని సినిమాలకి కూడా అసలు అగ్ని పరీక్ష మొదలవుతుంది అని చెప్పాలి.
మన శంకర వరప్రసాద్ గారు, రాజా సాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి అలాగే నారీ నారీ నడుమ ఇంకా అనగనగా ఒక రాజు సినిమాలు అన్నీ ప్రతీ గంట బుకింగ్స్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. మరి ఈ వారం 10 రోజులు బాగానే నెట్టుకొచ్చేశాయి. కానీ ఈ సోమవారం వర్కింగ్ డే నుంచి అసలు టెస్ట్ మొదలు.. వీటిలో ఏ సినిమా నిలబడుతుంది ఏది ఫట్టమంటుంది అనేది ఒక క్లారిటీ ఈ సోమవారం పెర్ఫామెన్స్ తో కన్ఫర్మ్ అయ్యిపోతుంది. సో ఏ సినిమాకి ఎలాంటి ఫలితం దక్కుతుంది అనేది వేచి చూడాల్సిందే.


