రూమర్స్ పై స్పందించిన రష్మిక !

రూమర్స్ పై స్పందించిన రష్మిక !

Published on Jan 19, 2026 2:02 PM IST

Rashimka

హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా ఓ చిట్‌చాట్‌లో పాల్గొని.. పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలిచ్చారు. ముఖ్యంగా తనపై వచ్చిన రూమర్స్‌ పై ఆమె క్లారిటీ ఇచ్చారు. అసలు రష్మిక ఏం మాట్లాడారు అంటే.. ‘నేను 2016 నుంచి ఇప్పటివరకూ ఒకేలా పని చేస్తున్నాను. ఎలాంటి భాషాపరమైన హద్దులు లేకుండా భిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ నటిస్తున్నాను. ఇకపై కూడా అలానే ఉంటాను. అన్నిరకాల చిత్రాల్లో నటించాలని ఉంది’ అని ఆమె తెలిపారు.

తనపై వచ్చిన రూమర్స్‌ పై రష్మిక మాట్లాడుతూ.. ‘వ్యూస్‌తో డబ్బులు సంపాదించడం కోసం నెగెటివిటీ సృష్టించి కొందరు మనపై ఏదేదో రాస్తారు. వాళ్లకు నిజంగానే నాపై కోపం ఉండొచ్చు.. దానికి ఇంకాస్త యాడ్‌ చేసి రాస్తుంటారు. నిజాయతీగా చెప్పాలంటే అలాంటి వార్తలు కూడా ఎంతోమందిని పోషిస్తున్నాయి. పోనీలే.. వాళ్లను కూడా బతకనీ అని వదిలేస్తా. ఇండస్ట్రీలో ఉన్నవారికి నెగెటివిటీ కామన్‌. అందుకే అందరి పైనా వార్తలు వస్తూనే ఉంటాయి. ఏదోఒకరోజు ప్రజలకు నిజం తెలుస్తుంది అని అనుకుంటా’ అని రష్మిక తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు