దుబాయ్‌లో ‘మెగా 158’ చర్చలు.. బాసు స్పీడ్ మామూలుగా లేదుగా..!

దుబాయ్‌లో ‘మెగా 158’ చర్చలు.. బాసు స్పీడ్ మామూలుగా లేదుగా..!

Published on Jan 20, 2026 8:00 PM IST

Mega 158

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌తో బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తోంది. ఈ సినిమా సక్సెస్‌ను అందరూ ఎంజాయ్ చేస్తుండగా, మెగాస్టార్ మాత్రం అప్పుడే తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టారు.

మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి సంబంధించిన అన్ని ప్రమోషన్స్‌ను ముగించుకుని దుబాయ్ వెళ్లారు. ఆయన అక్కడ దర్శకుడు బాబీతో కలిసి ‘మెగా 158’(Mega 158 ) ప్రాజెక్ట్ స్క్రిప్టుపై వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే ఫైనల్ స్క్రిప్ట్ లాక్ కావడంతో, దానిపై టీమ్ అందరూ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ స్క్రిప్ట్‌ను స్టార్ రైటర్ కోన వెంకట్ పర్యవేక్షిస్తున్నారట.

దీంతో మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంకా అందరూ మన శంకర వరప్రసాద్ గారు మ్యానియాలోనే ఉండగా, బాసు మాత్రం అప్పుడే మెగా 158 పనులు మొదలుపెట్టడంతో ఆయన స్పీడ్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనుండగా కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనున్నారు.

తాజా వార్తలు