మొత్తం ఓవర్సీస్‌లో బాస్ ర్యాంపేజ్.. కలెక్షన్స్ ఎంతంటే..?

మొత్తం ఓవర్సీస్‌లో బాస్ ర్యాంపేజ్.. కలెక్షన్స్ ఎంతంటే..?

Published on Jan 21, 2026 10:00 PM IST

Mana Shankara Vara Prasad Garu

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ‘మెగా సంక్రాంతి బ్లాక్ బస్టర్’గా నిలిచింది. ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కళ్లుచెదిరే కలెక్షన్స్ వస్తుండటంతో ఈ సినిమా పలు రికార్డులు క్రియేట్ చేస్తుంది.

ఈ చిత్రం కేవలం ఓవర్సీస్ మొత్తంలో ఏకంగా 4.2 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో మెగాస్టార్ స్టామినా ఏమిటో మరోసారి ప్రూవ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ ప్రయాణం ఇక్కడితో ఆగడం లేదు. ప్రస్తుతం ఉన్న జోరు చూస్తుంటే త్వరలోనే ఓవర్సీస్ మార్కెట్‌లో 5 మిలియన్ డాలర్ల మార్కును చేరుకునే దిశగా దూసుకుపోతోంది.

సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు. విదేశాల్లోని తెలుగు ప్రేక్షకులు చిరంజీవి నటనకు, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కు బ్రహ్మరథం పడుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు