OTT : 4 భాషల్లో ‘ఓ..! సుకుమారి’ ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పటినుంచంటే?

OTT : 4 భాషల్లో ‘ఓ..! సుకుమారి’ ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పటినుంచంటే?

Published on Aug 4, 2026 2:27 PM IST

Oh Sukumari OTT Release Date

యంగ్ హీరో తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన ‘ఓ..! సుకుమారి’ (Oh Sukumari) సినిమా ఓటీటీ ముస్తాబైంది. ప్రముఖ డిజిటల్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది.

4 భాషల్లో ఏకకాలంలో స్ట్రీమింగ్

ఆగస్టు 7 నుంచి ‘ ఓ..! సుకుమారి ‘ చిత్రం ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను పలకరించనుంది.

పెళ్లి దుస్తుల్లో సాంప్రదాయబద్ధంగా కనిపిస్తూ చిరునవ్వులు చిందిస్తున్న పోస్టర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీ వీక్షకులను అలరిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. థియేటర్లలో ఈ సినిమాను చూడటం మిస్సయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు ఆగస్టు 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు.

తాజా వార్తలు