గోపీచంద్ టైటిల్‌ను వాడేస్తున్న విశాల్.. వర్కవుట్ అయ్యేనా..?

గోపీచంద్ టైటిల్‌ను వాడేస్తున్న విశాల్.. వర్కవుట్ అయ్యేనా..?

Published on Jan 22, 2026 12:02 AM IST

Mogudu

కోలీవుడ్ మాస్ హీరో విశాల్, కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ సుందర్ సీ కాంబినేషన్‌లో సరికొత్త యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం సిద్ధమవుతోంది. విశాల్ కెరీర్‌లో 36వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు తెలుగులో ‘మొగుడు’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, తాజాగా విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ గ్లింప్స్ వీడియోలో యోగిబాబు మార్క్ కామెడీ హైలైట్‌గా నిలిచింది. ‘మొగుడులా ఉండటం ముఖ్యం కాదు, మొగుడు మొగుడులా ఉండటమే ముఖ్యం’ అంటూ ఆయన చెప్పే డైలాగులు నవ్వులు పూయిస్తున్నాయి. ఇందులో తమన్నా భర్తను శాసించే భార్యగా కనిపిస్తుండగా, విశాల్ ఇంటి పనులు చేసే భర్తగా ఉంటూనే తనదైన స్టైల్లో యాక్షన్ సీక్వెన్స్‌లతో అదరగొట్టాడు. భార్యాభర్తల మధ్య సాగే ఫన్నీ వార్‌తో పాటు పక్కా యాక్షన్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయని గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది.

గతంలో ఇదే టైటిల్‌తో కృష్ణవంశీ-గోపీచంద్ కాంబినేషన్‌లో ఓ సినిమా వచ్చినప్పటికీ, అది ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఇప్పుడు అదే టైటిల్‌తో వస్తున్న విశాల్.. ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి.

తాజా వార్తలు