తంజావూరు పెయింటింగ్స్‌తో రష్మిక మందన్న కోసం స్పెషల్ డిజైన్.. ఈ డ్రెస్ ప్రత్యేకత తెలిస్తే వావ్ అనాల్సిందే!

తంజావూరు పెయింటింగ్స్‌తో రష్మిక మందన్న కోసం స్పెషల్ డిజైన్.. ఈ డ్రెస్ ప్రత్యేకత తెలిస్తే వావ్ అనాల్సిందే!

Published on Mar 12, 2026 10:59 PM IST

rashmika 2

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా మెహందీ, ప్రధానం ఫంక్షన్లలో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫొటోల్లో రష్మిక ధరించిన ట్రెడిషనల్ డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అచ్చం గుడిలోని దేవతలా, ఎంతో అందంగా ముస్తాబైన రష్మిక లుక్ వెనుక ఒక అద్భుతమైన ఆలోచన దాగుంది. ప్రముఖ డిజైనర్ కరణ్ తోరానీ ఈ అవుట్‌ఫిట్‌ను డిజైన్ చేశారు. ఈ అందమైన డ్రెస్ తయారీకి వెనుక ఉన్న స్ఫూర్తిని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

సాధారణంగా భారతీయ సంప్రదాయంలో కొత్తగా ఇంట్లోకి అడుగుపెట్టే పెళ్లికూతురిని మహాలక్ష్మితో పోలుస్తారు. ఆ లక్ష్మీదేవి రాకతో ఇంట్లోకి సిరిసంపదలు, ప్రశాంతత వస్తాయని మనవాళ్లు నమ్ముతారు. సరిగ్గా ఇదే ఆలోచనతో రష్మిక కోసం ఈ డ్రెస్‌ను సిద్ధం చేశారు. రష్మికను తొలిసారి కలిసినప్పుడు ఆమెలోని స్టార్‌డమ్ కాకుండా, మైసూర్ నుంచి వచ్చిన ఒక సాధారణ అమ్మాయి కనిపించిందని కరణ్ చెప్పుకొచ్చారు. మూలాలను మర్చిపోని ఆమె సింప్లిసిటీకి తగ్గట్టుగానే ఈ అవుట్‌ఫిట్ ఉండాలని ఆయన భావించారు.

తంజావూరు పెయింటింగ్స్ స్ఫూర్తితో..

దక్షిణాది కళాకృతులకు ప్రతీకగా నిలిచే తంజావూరు పెయింటింగ్స్‌ను ఈ డ్రెస్ కోసం ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారు. తంజావూరు చిత్రాల్లో కనిపించే ఆలయ తోరణాలు, లక్ష్మీదేవి ప్రతిమలు, మెరిసే బంగారు వర్ణాలను రష్మిక డ్రెస్‌పై అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆభరణాలతో కూడిన కార్సెట్, ధోతీ స్కర్ట్‌తో పాటు లక్ష్మీదేవి మోటిఫ్స్‌తో ఉన్న దుపట్టాను (ఓణీ) ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

రంగులు, కళాత్మకత కలయికగా.. నడిచొచ్చే ఒక అందమైన గుడిలా ఈ డ్రెస్ ఉండాలన్నది డిజైనర్ ముఖ్య ఉద్దేశం. ముఖంపై చిరునవ్వుతో, పచ్చని ప్రకృతి మధ్య విజయ్‌తో కలిసి రష్మిక నడిచి వస్తున్న ఫొటో చూస్తే.. ఆ డిజైనర్ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందనే చెప్పాలి. ఒక కొత్త పెళ్లికూతురు అచ్చం మహాలక్ష్మిలా కళకళలాడుతూ వస్తున్న ఫీలింగ్ ఈ ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by T O R A N I (@toraniofficial)

సంబంధిత సమాచారం

తాజా వార్తలు