మెగాస్టార్ కోసం సీనియర్ బ్యూటీ.. బాబీ ఏం ప్లాన్ చేస్తున్నాడో..?

మెగాస్టార్ కోసం సీనియర్ బ్యూటీ.. బాబీ ఏం ప్లాన్ చేస్తున్నాడో..?

Published on Jan 22, 2026 7:07 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాతో చిరంజీవి బాక్సాఫీస్ రికార్డులను రఫ్ఫాడిస్తున్నాడు. అయితే, ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్ ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ పై ఫోకస్ పెట్టారు.

దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో చిరు తన కెరీర్‌లోని 158 చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కోసం మెగాస్టార్, డైరెక్టర్ బాబీ అండ్ టీమ్ దుబాయ్‌కు వెళ్లారు. కాగా, ఈ సినిమాలో చిరు పక్కన హీరోయిన్‌గా ఓ సీనియర్ హీరోయిన్ నటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టాలెంటెడ్ నటి ప్రియమణి ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి భార్యగా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక చిరంజీవి కూతురి పాత్రలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి నటించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అసలు దర్శకుడు బాబీ ఏం ప్లాన్ చేస్తున్నాడా.. అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు