మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాతో చిరంజీవి బాక్సాఫీస్ రికార్డులను రఫ్ఫాడిస్తున్నాడు. అయితే, ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్ ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ పై ఫోకస్ పెట్టారు.
దర్శకుడు బాబీ డైరెక్షన్లో చిరు తన కెరీర్‌లోని 158 చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కోసం మెగాస్టార్, డైరెక్టర్ బాబీ అండ్ టీమ్ దుబాయ్‌కు వెళ్లారు. కాగా, ఈ సినిమాలో చిరు పక్కన హీరోయిన్గా ఓ సీనియర్ హీరోయిన్ నటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టాలెంటెడ్ నటి ప్రియమణి ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి భార్యగా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక చిరంజీవి కూతురి పాత్రలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి నటించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అసలు దర్శకుడు బాబీ ఏం ప్లాన్ చేస్తున్నాడా.. అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


