మన తెలుగు సినిమా నుంచి బాలీవుడ్ హాలీవుడ్ వరకు కూడా వెళ్లిన నటి ఎవరైనా ఉన్నారు అంటే అది అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ అక్కినేని అనే చెప్పాలి. అయితే ఆమె తెలుగులో సినిమా చేసి చాలా కాలమే అయ్యింది. కానీ ఆమెనే ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రమే ‘చీకటిలో’. శరన్ కొప్పిశెట్టి తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం నేరుగా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చింది.
ట్రైలర్ తో మంచి ఆసక్తి రేపిన ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా అందులో ఇవాళ్టి నుంచి ఈ చిత్రం అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు, హిందీ, తమిళ్, భాషల్లో ఈ సినిమా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. ఇది శోభితకి మొదటి తెలుగు ఓటిటి డెబ్యూ కావడం విశేషం. ఇక ఈ సినిమాలో 35 చిన్న కథ కాదు నటుడు విశ్వదేవ్ రాచకొండ నటించగా ఇవాళ్టి నుంచి సినిమా అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ని ఆడియెన్స్ నుంచి అందుకుంటుందో చూడాలి.


