సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ లాంటి భారీ తారాగణంతో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో చేస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ చిత్రం “వారణాసి” (Varanasi) కోసం ఇప్పుడు ప్రపంచమే ఎదురు చూస్తుంది. మరి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఆడియెన్స్ లో ఏ చిన్న అంశం అయినా మంచి సెన్సేషన్ గా మారుతుంది.
అయితే లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ మొదలైంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఈ మధ్య అంతా కాంట్రవర్సీలలోనే ఎక్కువ వినిపించిన హీరోయిన్ దీపికా పదుకోణ్ కూడా ఉన్నట్టు పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అది కూడా మహేష్ సరసన హీరోయిన్ అంటూ ఇంకో వెర్షన్ వినిపిస్తుంది.
కానీ ఇందులో ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. మేకర్స్ ఆల్రెడీ తమ ప్లానింగ్ పట్ల క్లారిటీ గానే పనులు చేస్తూ వెళుతున్నారట. సో దీనిపై ఒక అధికారిక క్లారిటీ వస్తేనే మేటర్ ఏంటి అనేది కన్ఫర్మ్ అవుతుంది. అంతవరకు దీపికా ఉంది అనే మాటలో నిజం లేదనే అనుకోవాలి.


