రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘రౌడీ జనార్థన’ అనే ఊరమాస్ సినిమాలో నటిస్తున్న విజయ్ ఈ సినిమాలో పూర్తి రఫ్ లుక్‌లో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడు. దర్శకుడు రవికిరణ్ కోలా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు-శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు మరో డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు.
ఈ సినిమాను పీరియాడిక్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పుడు ఓ సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. VD14 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టైటిల్‌ను మేకర్స్ జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రివీల్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై యేర్నేని నవీన్, రవిశంకర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. టైటిల్‌తో పాటు ఓ గ్లింప్స్ కూడా మేకర్స్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.


