ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా రేంజ్ లో ప్రెజెంట్ చేస్తూ తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ కూడా ఒకటి. అయితే ఈ సినిమా విషయంలో చాలానే రచ్చ నడుస్తుంది కానీ కొన్ని ఊహించని అంశాలు కూడా ఈ సినిమా పట్ల వినిపిస్తున్నాయి.
దాదాపుగా ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి? ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఎలాంటి సినిమా ప్లాన్ చేస్తున్నాడు అనేది చాలా మందికి ఐడియా లేదు. నీల్ గత సినిమాలు కేజీయఫ్, సలార్ ఫ్లేవర్ లలోనే ఈ సినిమా కూడా ఉంటుంది అని కూడా చాలా వరకు భావిస్తూ ఉండొచ్చు. కానీ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ప్లాన్ చేస్తుంది మాత్రం అంతకు మించి అని తెలుస్తుంది.
ముఖ్యంగా సినిమా తాలూకా ఫస్ట్ కంటెంట్ ఒక్కటి బయటకి వచ్చాక అసలు వీరేం చేస్తున్నారు అనేది చూసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యానికి లోనవుతారని వినిపిస్తుంది. ఇలా ఎవ్వరి ఊహించని కంటెంట్ అండ్ ప్లానింగ్ తోనే వీరు వస్తున్నారట. అందుకే ఇంత ఆలస్యం అవుతుందని కూడా వినిపిస్తుంది. మరి ప్రశాంత్ నీల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ తో ఏం ప్లాన్ చేస్తున్నాడు అనేది వేచి చూడాల్సిందే.


