తమిళ స్టార్ హీరో సూర్య వర్సటైల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే సూర్య, తన కెరీర్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ముందుకు రాబోతున్నాడు. జిత్తు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘సీన్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ టైటిల్ టీజర్ ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠను పెంచుతుండగా, పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న సూర్య లుక్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ చిత్రంలో సూర్యతో పాటు నజ్రియా నజీమ్, నస్లేన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూర్తి స్థాయి మాస్ మరియు ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా టైటిల్ టీజర్ విజువల్స్, సూర్య స్టైలిష్ అండ్ పవర్‌ఫుల్ ప్రెజెన్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని నవంబర్ 6న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


