మొత్తానికి నితిన్ కొత్త సినిమా.. ఊహించని దర్శకుడు ఊహించని జానర్లో

మొత్తానికి నితిన్ కొత్త సినిమా.. ఊహించని దర్శకుడు ఊహించని జానర్లో

Published on Jan 25, 2026 1:57 PM IST

Nithiin-36

మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన గత రెండు సినిమాలు తన మార్క్ హిట్స్ గా నిలవలేదు. దీనితో తన స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం అంతా చూస్తుండగా తన నుంచి ఊహించని కాంబినేషన్ ఇప్పుడు అనౌన్స్ అయ్యింది. మధ్యలో ఎల్లమ్మ, తెలుసు కదా లాంటి సినిమాలు తన నుంచి మిస్ అయ్యినప్పటికీ ఫైనల్ గా ఈ గ్యాప్ ని భర్తీ చేస్తూ క్రేజీ ప్రాజెక్ట్ ని తాను లాక్ చేసుకున్నాడు.

మన తెలుగు సినిమా దగ్గర పలు ప్రయోగాత్మక కాన్సెప్ట్ చిత్రాలు ఎక్కడికి పోతావు చిన్నవాడా, డిస్కో రాజా, ఒక్క క్షణం రీసెంట్ గా ఊరు పేరు భైరవ కోన సినిమాలు చేసిన దర్శకుడు వి ఐ ఆనంద్ తో కొత్త చిత్రాన్ని ఇప్పుడు నితిన్ అనౌన్స్ చేయడం విశేషం. అంతే కాకుండా ఈ చిత్రాన్ని కూడా ఒక సై ఫై జానర్ సబ్జెక్టుగా తెస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి శ్రీనివాస చిట్టూరి నిర్మాణం వహిస్తుండగా నితిన్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎగ్జైటింగ్ గా ఉన్నట్టు చెబుతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు