మెగాస్టార్ నుంచి అనిల్‌ రావిపూడికి అదిరిపోయే గిఫ్ట్‌ !

మెగాస్టార్ నుంచి అనిల్‌ రావిపూడికి అదిరిపోయే గిఫ్ట్‌ !

Published on Jan 25, 2026 10:00 PM IST

anil ravipudi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి (anil ravipudi) దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా సంక్రాంతికి స్పెషల్ గా విడుదలైంది. ఈ సినిమా రూ.300 కోట్లకుపైగా వసూళ్లును రాబట్టింది. ఈ నేపథ్యంలో అనిల్‌ రావిపూడికి చిరంజీవి అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చారు. అల్ట్రా ప్రీమియర్‌ రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్ కారును మెగాస్టార్ కానుకగా ఇచ్చారు. కారు నచ్చిందా ? అని మెగాస్టార్ అడగ్గా, ‘మెగా బహుమతి మహదానందం మనోధైర్యం ధనాధన్‌’ అంటూ అనిల్‌ రావిపూడి నవ్వులు పంచారు.

మొత్తానికి అనిల్ రావిపూడి ఫుల్ వినోదాత్మక చిత్రాన్ని అందించారు, ఇందులో చిరంజీవి ట్రేడ్‌మార్క్ కామెడీ టైమింగ్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాలు, పాటలు మరియు మాస్ సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఈ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ లో నయనతార కథానాయికగా నటించింది. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాకు థియేటర్లలో అద్భుతమైన ఓపెనింగ్స్ లభించాయి, పైగా రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది.

తాజా వార్తలు