‘ఆదిత్య 999 మ్యాక్స్‌’ పై కొత్త రూమర్ !

‘ఆదిత్య 999 మ్యాక్స్‌’ పై కొత్త రూమర్ !

Published on Jan 26, 2026 12:00 AM IST

mokshagna-and-balayya

బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమా ‘ఆదిత్య 369’కి కొనసాగింపుగా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘ఆదిత్య 999 మ్యాక్స్‌’తోనే మోక్షజ్ఞ కథానాయకుడిగా పరిచయం కానున్నట్టు బాలయ్య ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు క్రిష్‌ ఈ సినిమాని తెరకెక్కించనున్నాడు. ఆల్ రెడీ ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ఐతే, వచ్చే నెలలో ఈ సినిమాని అధికారికంగా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో బలమైన క్యాస్టింగ్ కూడా ఉంటుందట. అలాగే, మోక్షజ్ఞ లుక్‌ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుందని తెలుస్తోంది. ఐతే, ఈ వార్త పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఆ మధ్య తన వారసుడి ఎంట్రీ పై బాలయ్య మాట్లాడుతూ.. ‘మోక్షజ్ఞను ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో నాకు తెలుసు. మోక్షజ్ఞ కోసం ఒక ఐదు ఆరు స్క్రిప్ట్స్ నా మైండ్ లోనే రెడీగా ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నారు.

తాజా వార్తలు