నటసింహ బాలయ్య భారీ చిత్రం అఖండ 2 (Akhanda 2) లో విలన్ గా నటించిన టాలెంటెడ్ నటుడు ఆది పినిశెట్టి హీరోగా నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ చిత్రం ‘డ్రైవ్’ (Drive) కూడా అదే సినిమాతో థియేటర్స్ లోకి వచ్చింది. అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ లో థియేటర్స్ లో రాణించలేదు. కానీ తర్వాత ఓటిటిలో విడుదల అయ్యాక డీసెంట్ రెస్పాన్స్ ని అందుకుంది. ఈ సినిమాని మొదటిగా పాపులర్ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఈ (Drive) సినిమా మరో ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది. ఈ సినిమాని మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు కూడా సొంతం చేసుకున్నారు. దీనితో ఈ చిత్రాన్ని ఈ జనవరి 30 నుంచి ఆహాలో తీసుకొస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. సో అప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో లేక ఆహా మాత్రమే ఉన్నవాళ్లు చూడాలి అనుకుంటే ఇంకొన్ని రోజులు చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి జెనూస్ మొహమ్మద్ దర్శకత్వం వహించగా వి ఆనంద ప్రసాద్ నిర్మాణం వహించారు.


