ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే జన నాయగన్ (Jana Nayagan). దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ సినిమా బాలయ్య నటించిన భారీ చిత్రం భగవంత్ కేసరి కి కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్ గా రాబోతుంది. అన్నీ బాగుండి ఉంటే ఈ సినిమా పొంగల్ కానుకగా రావాల్సి ఉంది కానీ ఊహించని కారణాలతో వాయిదా పడింది. అక్కడ నుంచి కొత్త డేట్ సస్పెన్స్ గా మారగా ఫైనల్ గా ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కి కొత్త డేట్ లాక్ అయినట్టు తెలుస్తుంది.
జన నాయగన్ (Jana Nayagan) ఈ ఫిబ్రవరి 6న గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం కానున్నట్టు ఇప్పుడు సమాచారం. నేడు రానున్న తీర్పుతో మేకర్స్ ఇదే డేట్ ని అనౌన్స్ చేస్తారని టాక్. సో దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా మమితా బైజు విజయ్ కి కూతురు పాత్రలో నటించింది. అలాగే బాబీ డియోల్ విలన్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమాని కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించగా తెలుగు, హిందీ రిలీజ్ కూడా ప్రకటించారు.


