‘పెద్ది’ వర్సెస్ ‘ఫౌజీ’ సంభవం.. దసరా హీట్ షురూ..!

‘పెద్ది’ వర్సెస్ ‘ఫౌజీ’ సంభవం.. దసరా హీట్ షురూ..!

Published on Jan 29, 2026 6:03 PM IST

peddi-and-fauzi

ఈ కొత్త ఏడాదిలో అయినా చాలా వరకు సినిమాలు ఆన్ టైం వస్తాయా అని అందరి హీరోల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసారు. కానీ ఇంకా జనవరి నెల పూర్తి కాకుండానే ఆల్రెడీ రిలీజ్ డేట్స్, సమయాలు లాక్ చేసుకున్న సినిమాలు అన్నీ మారిపోతూ ఉండడం ఫ్యాన్స్ కి నిరుత్సాహాన్ని మిగులుస్తున్నాయి.

ఇలా మార్చ్ లో రావాల్సిన రామ్ చరణ్ చిత్రం పెద్ది(Peddi) దసరాకి వెళ్లినట్టు రూమర్స్ వచ్చాయి. ఇక లేటెస్ట్ గా ఇదే దసరా రేస్ లో మరో భారీ చిత్రం ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ(Fauzi) కూడా లాక్ అయ్యింది అంటూ సినీ వర్గాల్లో గట్టి టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. దీనితో దసరా రేస్ హీట్ ఇప్పుడు నుంచే మొదలవుతుంది అని చెప్పాలి.

పెద్ది సినిమా షూటింగ్ ఇంకా బాలన్స్ ఉండడంతో మార్చ్ నుంచి దసరాకి షిఫ్ట్ అయ్యింది. అయితే నిజానికి ప్రభాస్ ఫౌజీ ని ఆగష్టు లో ప్లాన్ చేశారు. కానీ దీనికి మధ్యలో కొన్ని డిలే సమస్యలు మూలాన ఇది కూడా దసరా రిలీజ్ కి ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది. సో ఒకే సమయం కాబట్టి ఈ రెండు సినిమాల నడుమ క్లాష్ తప్పేలా లేదని చెప్పాలి. మరి రానున్న రోజుల్లో ఇందులో కూడా ఏమన్నా మార్పులు చేర్పులు జరుగుతాయేమో చూడాలి.

తాజా వార్తలు