ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో ఓ భారీ సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్, తన కెరీర్‌లోని 23వ చిత్రాన్ని మరో తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటనతోనే యావత్ ఇండియన్ సినిమాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశాడు ఐకాన్ స్టార్. AA23 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమా గురించి రోజుకో వార్త సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
తాజాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ కోసం లోకేష్ వేట మొదలుపెట్టాడనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ ప్రెస్టీజియస్ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ని తీసుకురావాలని దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రయత్నిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మేకర్స్ మాత్రం ఇప్పటివరకు కేవలం హీరో, దర్శకుడు, నిర్మాతలు, సంగీత దర్శకుడిని మాత్రమే అధికారికంగా లాక్ చేశారు.
దీంతో శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో నటించబోతుందనే వార్తపై ఎలాంటి క్లారిటీ అయితే లేదు. కానీ, ఈ విషయంపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. అల్లు అర్జున్ పక్కన శ్రద్ధా కపూర్ నటిస్తే బాగుంటుందని.. వాస్తవానికి ‘పుష్ప’ సినిమా సమయంలోనే ఈ జోడీ సెట్ కావాల్సి ఉందని.. కానీ, అప్పుడు కుదర్లేదని.. ఇప్పటికైనా లోకేష్ ఆమెను ఈ సినిమా కోసం తీసుకొస్తే బాగుంటుందని వారు సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ప్రభాస్ సరసన ‘సాహో’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన శ్రద్ధా ఇప్పుడు బన్నీ పక్కన నిజంగానే నటిస్తుందా అనేది వేచి చూడాలి.


